Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్కినేని ఆశయాలు భావితరాలకు ఆదర్శం

అలనాటి మేటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) ఛైర్మన్ తోటకూర ప్రసాద్ అన్నారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, దృక్పథం వంటి మంచి లక్షణాలకు అక్కినేని మారుపేరని కొనియాడారు. అక్కినేని పేరు మీద అవార్డు నెలకొల్పి సమాజానికి సేవ చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులకు అందజేస్తామని ఆయన ప్రకటించారు.

మెరుగైన సమాజం కోసం విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ వంటి రంగాల్లో అక్కినేని ఆశయాలను ముందు తరాల వారికి తెలియజేసేందుకు ఏఎఫ్ఏ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆయన అన్నారు. విశ్వవ్యాప్తంగా ప్రతి ఏటా కార్యక్రమాలు చేపడుతామని ఆయన చెప్పారు. ప్రసాద్ తో పాటు ఏఎఫ్ఏ వైస్ ఛైర్మన్ రవి కొండబోలు, డైరెక్టర్ భక్తవత్సలం ఇటీవల అక్కినేని స్వస్థలమైన కృష్ణా జిల్లా, వెంకట రాఘవాపురం గ్రామాన్ని సందర్శించారు. ఏఎన్ఆర్ కళాశాలకు వెళ్లి, వచ్చే డిసెంబరులో అక్కడ అక్కినేని అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించే విషయమై చర్చించారు. హైదరాబాదులో అక్కినేని కుటుంబ సభ్యుల్ని కూడా వారు పరామర్శించారు. అక్కినేని నివాసంలో నాగ సుశీల, సుమంత్, సుప్రియ తదితరుల్ని కలిశారు.

More Telugu News